క్రీస్తు యొక్క జీవితం, 2
సువార్త సన్నివేశములు చదువుటయందు ప్రతి క్రైస్తవుడు సంతోషించాలి. యేసు జీవిత సన్నివేశములను అవి జరిగిన కాల క్రమములో పెట్టుట ద్వారా డేవిడ్ L. రోపెర్, యేసు జీవితములోని మాటలు, సంభాషణలు, మరియు ఆయన అనుదిన చర్యలను నేర్చుకొనే అనుభవంలోనికి మనలను నడిపిస్తూ, క్రీస్తు జీవించిన విధముగా జీవించుటకు చదవరులను ప్రోత్సహిస్తున్నారు. పాలస్తీనా భౌగోళిక అధ్యయనం ద్వారా, అక్కడి ప్రజల యొక్క అలవాట్లు మరియు విధానాల ద్వారా, యేసు చుట్టుప్రక్కల ఉన్న పలు సముహముల ప్రజల యొక్క మాటల-చిత్రముల ద్వారా,యేసు జీవితము మన హృదయాలలో మండునట్లు Roper చేస్తున్నారు. క్రీస్తు తన తండ్రి యొద్ద నుండి తెచ్చిన సందేశమును మాత్రమే గాక, ఈ కోర్సు క్రీస్తు జీవిత పరిస్థితులలో ఉన్న దృశ్యములు మరియు శబ్దములు, ధూళి మరియు జీవన పరిస్థితులు, పగలు మరియు రాత్రులు మనకు తెలియజేస్తుంది. ఈ రెండు కోర్సులను ఆలోచనాపూర్వకంగా అధ్యయనం చేసినవారెవ్వరూ మార్పు చెందకుండా ఉండలేరు. యేసుతో నడచి, ఆయన బోధలు విని, తన కాలములోని ప్రజలతో సంభాషిస్తూ ఆయనను చూసి, ఆయన మరణ పునరుత్థానములను చూసిన తరువాత ఎవరు మార్పు చెందకుండా ఉండగలరు!