ఎఫెసీయులు మరియు ఫిలిప్పీయులు

“క్రీస్తు నందు” క్రైస్తవులు పొందుచున్న గొప్ప ఆత్మసంబందమైన ఆశీర్వాదములను గూర్చి పౌలు వ్రాసిన ఎఫేసీ పత్రిక వివరించుచున్నది. మన ప్రభువు తన సంఘముపై శిరస్సుగా పరిపాలిస్తున్నాడు . తండ్రి యొక్క కుడి పార్స్వమునకు అత్యున్నతంగా హెచ్చింపబడి ఉన్నాడని దృఢంగా వక్కాణించినది. దేవుని అనుకరించు జీవిత విధానం ద్వారా వివిధమైన అవయవాలైన సంఘ సభ్యులు ఒక్కటే విశ్వాసముతో క్రీస్తు శరీరంతో ఐక్యతగా ఉండుటకు పిలువబడ్డారు . దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మరియు నిరంతర అప్రమత్తతతో ఆత్మీయ పోరాటంలో ఉండాలని ఈ పత్రిక జ్ఞాపకము చేయును.
సువార్తను వ్యాప్తి చేయుట యందు క్రైస్తవులు కలిగియున్న సహవాసమును అభినందిస్తూ ఫిలిప్పీ పత్రిక వ్రాయబడింది. ఆత్మయందు ఐక్యత కలిగియుండి, పరలోక రాజ్య పౌరులుగా విశ్వాసులు జీవించుటకు పౌలు సవాలు చేసినారు. యేసు మానవ స్వరూపము ధరించి ఈ భూమి మీద ధీనత్వమును మాదిరి చూపిన, క్రీస్తును అనుకరించుట ద్వారా ఈ ఐక్యత కలుగును. మనము కూడ హెచ్చింపబడుటకు ముందు శ్రమలను మరియు హింసలను, క్రీస్తువలె అనుభవించి తీరవలయును.
Jay Lockhart మరియు David L Roper గార్లు అనేక సంవత్సరాల పఠనం ద్వారా వారి పరిచర్య ఫలాన్ని ఈ పత్రిక లలో వివరించారు పాఠకులు విశిష్ట నడకతో ఉండాలని నిర్దేశించారు . ఈ అధ్యయనం చేయుచున్న దేవుని వాక్య విద్యార్ధులందరూ ప్రయోజనం పొందుతారు.


కోర్సులో ఏమి లభిస్తాయి?

ఈ 50 రోజుల కోర్సు మీకు అవసరమైన అన్ని అంశాలతో అందించబడుతుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి మీకు అదనపు సమయం అవసరమైతే, మీరు అదనపు 30 రోజులపాటు సమయాన్ని పెంచుకోవచ్చు. నమూనా కోర్సు అంశాలు చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డిజిటల్ పుస్తకం

ఎఫెసీయులకు మరియు ఫిలిప్పీయులకు పుస్తకం Jay Lockhart & David L. Roper వ్రాశారు, దాని డిజిటల్ కాపీ మీకు కోర్సులో మీ అధ్యాపకుని వలె ఉపయోగపడుతుంది మరియు కోర్సు ముగిసిన తర్వాత అది మీ స్వంతమవుతుంది.

ఐదు అధ్యయన మార్గదర్శకాలు

ఇవి మీరు చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన కీలక పదాలు, అంశాలు, వ్యక్తులు మరియు స్థలాలను మీకు తెలియజేయడం ద్వారా మీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయంగా ఉంటాయి.

ఆరు పరీక్షలు

మీకు ఆటంకం కాకుండా సహాయంగా రూపొందించబడిన ప్రతి పరీక్షలో నేర్పిన అంశాలను మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నిర్ధారించడానికి చదవాలని పేర్కొన్న వాటి నుండి సేకరించిన యాభై ప్రశ్నలు ఉంటాయి. చివరి పరీక్షలో అన్ని అంశాల నుండి ప్రశ్నలు ఉంటాయి.

చదవాల్సిన వేగం మార్గదర్శకం

మీరు చదువుతున్న వేగం మార్గదర్శకంతో మీరు చదవాల్సిన షెడ్యూల్ కంటే ముందు ఉండండి. ఈ మార్గదర్శకం మీరు సెట్ చేసుకున్న సమయంలో కోర్సు పూర్తి చేయడానికి ఒక రోజులో చదవాల్సిన పేజీల సంఖ్యను తెలియజేస్తుంది.

అధ్యయన సహాయాలు

మీరు కోర్సులో నేర్చుకునే వాటికి అదనంగా అదనపు అధ్యయన అంశాలు లభిస్తాయి.