ప్రసంగి మరియు పరమగీతము
విజ్ఞాన సాహిత్యము అనే కోవకు చెందిన ఈ రెండు పుస్తకములు జీవితము మరియు ప్రేమ అనేవాటి యొక్క అర్థము విషయములో సందిగ్ధతలో ఉన్న క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రసంగి గ్రంధములో, (“ప్రసంగి”యైన) సొలొమోను స్వార్ధపూరిత ఆశయము అనే పనికిమాలిన జీవితమును త్యజించి ప్రతి క్రియను తీర్పులోనికి తెచ్చే దేవుని ఆజ్ఞలకు లోబడే జీవితమును జీవించుమని హెచ్చరిక చేస్తుంది. ఆ తరువాత, పరమగీతము గ్రంధములో, ప్రేమ మరియు వృద్ధి చెందునట్టి వైవాహిక సంబంధము అనే సుగుణాలను గూర్చి బోధిస్తున్నాడు. భావుకత, విశ్వాస్యత, మరియు స్పర్ధలను సరిదిద్దుకొనుట యెడల గల సమర్పణ వంటి అనేకమైన అనుబంధములను గూర్చిన విషయములు ఈ పుస్తక పాఠములలో ఉన్నవి.
జాగ్రత్తతో కూడిన పరిశోధన ద్వారా, ఈ రెండు పుస్తకముల యొక్క అర్థమును డా. డెన్నీ పెట్రిల్లో (Denny Petrillo) విడమరచి చూపుతున్నారు. ఇతర ధోరణులను కూడా పరిగణిస్తూనే, దేవుని వాక్యమునకు గొప్ప గౌరవమును వెల్లడిపరచగల సొలొమోను రచనలను అర్థము చేసికొనుటకు వీలగు ఒక విధానమును మనకు అందించి మన కాలానుగుణంగా విలువైన పాఠములను మనకు ఇస్తున్నారు.