అపొస్తలుల కార్యములు 1—14
అపొస్తలుల కార్యముల గ్రంథము ఆదిమ క్రైస్తవ్యము యొక్క మొదటి ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగియుండి, దాని ప్రేరేపిత నడిపింపు ద్వారా నేటి సంఘమునకు దేవుని చిత్తమును సూచిస్తుంది. అపొస్తలుల కార్యములు 1-14లో, డేవిడ్ L. రోపెర్ మన రక్షకుని ఆరోహణము మొదలుకొని అపొస్తలుడైన పౌలు మొదటి సువార్త ప్రయాణం వరకుగల మొదటి శతాబ్దపు ఆదిమ సంఘ చరిత్రలోనికి మనలను నడిపిస్తారు. తదుపరి కోర్సు అయిన అపొస్తలుల కార్యములు 15-28లో, ఆయన యెరూషలేము సభ మొదలుకుని రోమాలో పౌలు పరిచర్య వరకు చదువరులను నడిపిస్తారు.