కొలొస్సయులకు మరియు ఫిలేమోనుకు
కొలొస్సయులకు వ్రాసిన పుస్తకం విభిన్న మరియు సమకాలిత సమాజాలకు కావలసిన ముఖ్య ఉపదేశాలను కలిగి ఉంది. కొలొస్సలోని సంఘములో అభివృద్ధి ప్రారంభించగా, సభ్యులు క్రైస్తవులుగా తమ గుర్తింపును మరియు దేవునితోవున్న తమ సంబంధము విషయమై సవాలును ఎదురుకొన్నారు. కొలొస్స మరియు ఫిలేమోను పత్రికలు దైవశాస్త్ర సత్యాలను మరియు ఆనుభవపూర్వకమైన విశ్వాస సమస్యలను గూర్చి ప్రస్తావించాయి. ఈ విషయాలు నిత్యమైనవి, మరియు శ్రద్ధతో కూడిన ఈ పుస్తకాల అధ్యయనము మార్పుగల జీవిత అనుభుతినిస్తుంది.