ఆదికాండము 1—22
దేవుని ప్రారంభాల గ్రంథం యొక్క సవిస్తర దృష్టియైన దీనిలో, విల్లియం W. గ్రాషమ్ సృష్టి వృత్తాంతం గురించి దేవుడెన్నుకున్న ప్రజగా అబ్రాహాము మరియు అతని సంతానం ఎంపిక కావడం గురించి పాపానికున్న శాశ్వత (నిత్యమైన) పర్యవసానంనుండి మానవజాతిని రక్షించడానికి దేవునికున్న సంకల్పంలోని తొలి ప్రవచనం గురించి పరిశీలనాత్మకంగా తెలియజేయడం జరిగింది. ఆదికాండము, కొందరి వ్యక్తిగత జీవిత వివరాల్ని తెలియజేస్తూ, మనం ఎక్కడినుండి వచ్చాము, ఇక్కడ ఎందుకున్నాము, మనమెక్కడికి వెళ్తున్నాము అనే మానవ చరిత్రలోని గొప్ప వేదాంతపరమైన ప్రశ్నలకు జవాబులిస్తుంది.
ప్రాచీన ప్రపంచంలో నివసించినవారి చరిత్ర విషయానికొస్తే ముఖ్యమైన అంశం దేవునితో వారికున్న సంబంధం. ఆయన తన ప్రజలతో వ్యవహరించిన విధానం, ఆయన దివ్యలక్షణాల్ని, అంటే ఆయన నీతి మరియు ఉగ్రత, చేసిన ఏర్పాటు మరియు శిక్ష, ప్రతి వాగ్దానం పట్ల విశ్వాస్యతను వెల్లడిచేస్తోంది. నేడు ప్రతి మనిషి జీవితంలోను ప్రధాన పాత్రను పోషించడానికి అర్హత ఉన్న ఏకైక నిజ దేవుడు ఆయనే. సహోదరుడు గ్రాషమ్‌తోపాటు ఈ వివరణలో దేవునిని జాగ్రత్తగా ధ్యానించుటవలన దేవునిని ఎక్కువగా తెలుసుకోగలరు. పలు విస్త్రృత వివరణలు ఉపన్యాసాలున్న అనువర్తనలు, బోధకులు ఉపదేశకులు తమ పాఠాల్ని ఇంకా మెరుగుపర్చుకోడానికి ఉపయుక్తంగా ఉంటాయి.