యోషయా
యెషయా గ్రంథం ఒక విశేషమైన ప్రవచన గ్రంథం. క్రీ.పూ. ఎనిమిదవ శతాబ్దములోని యూదా వారికి దాని సందేశం స్పష్టముగా వినిపించింది, అయితే దాని స్వరం చరిత్రయందంతట కొనిపోబడింది. యూదా మరియు దాని చుట్టూ ఉన్న దుష్ట దేశాల పాపముపై దేవుని తీర్పు ప్రకటించిన తరువాత, యేసు క్రీస్తు మెస్సీయను గూర్చిన వాగ్దనముతో ప్రజలందరి నిరీక్షణను యెషయా సాటించెను. యెషయా గ్రంథ పఠనము ద్వారా దేవుని పరిశుద్ధతను వీక్షించి, ఆయన ఏమైతే చేసాడో దాని కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేలా చేస్తుంది.