లేవీయకాండము
లేవీయకాండము పుస్తకములో, దేవుడు యాజకత్వమును స్థాపించి ప్రత్యక్ష గుడారము వద్ద అర్పించబడవలసిన వివిధ బలులను ప్రతిష్ఠించెను. క్రైస్తవులు ధర్మశాస్త్రము క్రింద లేనప్పటికీ, మనము ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగముగా పిలవబడుచున్నాము. పాత నిబంధన యొక అర్పణ వ్యవస్థ దేవుని యొక్క ఖచ్చితమైన గొర్రెపిల్ల, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును ఇచ్చుటను ముందుగా సూచించినది. మన కొరకు ఆయన అర్పణకు స్పందనగా, ఆయన క్రొత్త నిబంధనకు నమ్మకమైన విధేయతతో జీవించాలి.