2 కొరింథీయులు
కొరింథులోని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు వ్రాస్తున్న తన పత్రికలో, నేటి కాలములో కూడా సంఘమును ఎక్కువగా బాధిస్తున్న అధికారము మరియు ఐక్యత అనే ముఖ్యమైన ప్రశ్నలకు జవాబునిస్తున్నాడు. డ్యుఎన్న్స్ యొక్క వచనము-వెంబడి-వచన అధ్యయనము బైబిలు వాక్యభాగములలోని కష్టతరమైన విషయములను విపులంగా పరిశీలించి పవిత్రమైన క్రైస్తవ జీవితమునకు సంబంధించిన కొన్ని అన్వయింపులను అందిస్తుంది. సహోదరులు తమ్ముతాము పరిశీలించుకొని సత్యమును గట్టిగా పట్టుకోవాలని పౌలు వారిని బ్రతిమాలాడు, ఎందుకనగా ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త సందేశము యొక్క పరిశుద్ధతను కలిగియున్న ఒక సాధారణ పాత్రయై యున్నాడు. సమర్పణ మరియు సేవను గూర్చిన తన సొంత మాదిరిని తన చదవరులు జ్ఞాపకముంచుకోవాలని మరియు అవసరతలో ఉన్న సహోదరులకు దాతృత్వముతో ఇచ్చిన ప్రభు సంఘములలోని సమూహములను కూడా అనుకరించుమని వారిని కోరాడు. జీవితము ఏమి తెచ్చినప్పటికీ కూడా, విశ్వాసముగల క్రైస్తవుడు ఎన్నటికీ నిరుత్సాహపడడు; కారణం ఈ మర్త్యత్వము అనేది ఒక దినమున శాశ్వత జీవమునకు దారితీస్తుంది అని ఈ అధ్యయనం నిశ్చయతను కలిగిస్తుంది.